ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎన్నికల ముందు చివరి బడ్జెట్ ను అసెంబ్లీకి సమర్పించింది. మొత్తం రూ.1,91,063.61 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.  అందులో భాగంగా  రూ.రూ.12,355 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. మంత్రి సోమిరెడ్డి శాసనసభలో వ్యవసాయ బడ్జెట్‌ను పెట్టారు. 2022 నాటికి ఆదాయం రెట్టింపు చేయడం లక్ష్యమని మంత్రి స్పష్టం చేసారు.
ఈ విషయమై   తన ప్రసంగంలో భాగంగా మాట్లాడుతూ… వ్యవసాయ రంగంలో ముఖ్య సమస్యలని పరిశీలించి వాటిని అధిగమించటానికి తగు సూచనలు చేస్తూ వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపకంగా మార్చటానికి ప్రైమరీ సెక్టార్ మిషన్ ను ఏర్పరచడమైనది. ఉత్పాదకతను పెంచటానికి ప్రాధమికంగా దృష్టి సారిస్తూ చేపట్టిన ప్రాధమిక కార్యక్రమాలు మంచి ఫలితాలను చూపుతూ పూర్తి స్దాయికి చేరుకోనున్నాయి అన్నారు. 
వ్యవసాయ బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు..రెవెన్యూ లోటు రూ. రూ.12,352 కోట్లుజాతీయ స్థాయి వృద్ధి రేటుతో పోల్చితే 14 శాతం అదనంగా నమోదురబీలో 42 శాతం వర్షపాతం తక్కువగా నమోదుమొక్కజొన్న ఉత్పత్తిలో దేశంలో రెండోస్థానంపెట్టుబడి వ్యవయం 467 కోట్లువరి దిగుబడి హెక్టార్‌కు 5176 కిలోల నమోదువరి ఉత్పత్తిలో దేశంలో ఏపీ మూడో స్థానం2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం90శాతం రాయితీలో వేరుశెనగ విత్తనాలు పంపిణీఉత్తరాంధ్రలో దిగుబడి పెంపునకు 50శాతం రాయితీతో విత్తనాలుతుంగడెంచలో మెగా సీడ్ పార్క్ ఏర్పాటువరి నేరుగా విత్తుకునే విధానంతో అధిక దిగుబడులుప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాంఅన్ని జిల్లాలకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం విస్తరణఊబర్ ద్వారా యంత్రపరికాలను అందుబాటులో ఉంచుతున్నాందేశంలో తొలిసారిగా 7లక్షలమంది కౌలు రైతులకు రుణాలుజైకా ప్రాజెక్టు కింద వ్యవసాయ యంత్రాల శిక్షణా కేంద్రాలుఅనంతపురంలో బిందు, తుంపర పరికరాల కేంద్రాలు ఏర్పాటువ్యవసాయ రంగంలో 25శాతం వృద్ధి రేటువరి, మొక్కజొన్న, పప్పుధాన్యాల ఉత్పత్తి పెరిగింది.వందశాతం రాయితీతో సూక్ష్మ పోషకాలువిత్తన పంపిణీలో జాతీయ స్థాయి అవార్డు సాధించాం.వ్యవసాయ యాంత్రీకరణకు రూ.250 కోట్లుపొలం పిలుస్తోంది, చంద్రన్న క్షేత్రాలకు రూ. 12.5 కోట్లువడ్డీ రాయితీకి రూ. 170 కోట్లు, పావలా వడ్డీకి రూ. 5.44 కోట్లుగన్నవరంలో ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్ సెంటర్‌‌కు రూ. 23 కోట్లుశీతల గిడ్డంగులు, ప్యాకింగ్ యూనిట్లు ఏర్పాటువరి, వేరుశెనగ, రాగిలో 17 వంగడాలు విడుదలనూతన పద్ధతులతో 30 శాతం ఉత్పత్తి పెరిగింది.పది లక్షల మంది రైతులతో రైతు ఉత్పత్తి దారుల సంఘాలు ఏర్పాటుప్రత్యేక మార్కెట్ సౌకర్యాల కల్పనుకు కృషికూరగాయల ఉత్పత్తి, నాణ్యత పెంపునకు రాయితీలుసెరికల్చర్ రైతులకు 48 కోట్లతో రాయితీలు