సెల్ ఛార్జింగ్ కు ఈ రైతు ఏం చేసాడో తెలుస్తే ఆశ్చర్యపోతారు

వేర్ దేరీజ్  ఎ వే.. దేర్ ఈజ్ ఎ విల్… సేయింగ్ పాతదే కానీ ఎప్పటికప్పుడు పంచే స్ఫూర్తి మాత్రం కొత్తగా ,ఆశ్చర్యకరంగా ఉంటుంది.  తాజాగా ఓ రైతన్న ఈ సేయింగ్ ని నిజం చేసి చూపించాడు. మనస్సుంటే మార్గం ఉంటుందని ప్రూవ్ చేసాడు.  తనకు, తన తోటి వారికి ఛార్జింగ్ చేయటానికి కరెంట్ లేదని ఏకంగా కరెంట్ కు ప్రత్యన్మాయంగా వాడే సోలార్ ని తన తలపై మోస్తూ  ఎంతో మంది సెల్ లకు జీవం నింపాడు. ఈ రోజున సెల్ లేకపోతే క్షణం నడవదు. అలాంటి సెల్  పనిచేయాలంటే పవన్ ఉండాల్సిందే కదా . అందుకే అతనీ నిర్ణయం తీసుకున్నాడు. అతని పేరు లక్ష్మణ్ భార్సే. 

తమ సమస్యల పరిష్కారానికి  మహారాష్ట్ర అసెంబ్లీని సోమవారం ముట్టడించటానికి   వేలాది రైతులు నాసిక్ నుంచి 180 కి.మీ. దూరంలోని ముంబై నగరానికి కాలి నడకన చేరుకున్న విషయం తెలిసిందే కదా.  దాదాపు 35 వేల మంది రైతులు ఎర్ర జెండాలు ఈ నిరసనలో పాల్గొంటున్నారు.అందులో ఒకడు ఈ లక్ష్మణ్.  కాలికి చెప్పులు కూడా లేకపోవడంతో రైతుల కాళ్లు కందిపోయాయి. కానీ వారు మాత్రం నడక ఆపలేదు.  నాసిక్ నుంచి ముంబై చేరుకునేంత వరకూ అడుగడుగునా.. వారికి స్థానికులు సహకరిస్తూ వచ్చారు. వారికి మంచినీళ్లు, ఆహార పదార్థాలు అందించారు. ముంబైలోని బైకుల్లా జంక్షన్ వద్దకు చేరుకోగానే కొంత మంది ముంబై వాసులు వారికి మంచినీళ్లు, ఖర్జూరాలు, బిస్కెట్లు అందించారు. రైతులు పాదాలకు చెప్పులు లేకుండా నడవడం చూసి చలించిపోయిన కొందరు.. వారికి పాదరక్షలు సమకూర్చారు. తన తోటి రైతులుకు ఇదిగో ఇలా ఛార్జింగ్ సాయం చేసాడు మన లక్ష్మణ్.