‘రైతుబంధు’తో రైతన్నకు మంచి రోజులు

‘రైతుబంధు’ చెక్కుతో డబ్బులు తీసుకోవడం ఎలాగంటే.. రైతు బంధు చెక్కు ద్వారా డబ్బులు డ్రా చేసుకోవాలంటే రైతులు తమ సమీపంలోని ఆంధ్రాబ్యాంక్ (మీ చెక్కు ఏ బ్యాంకుదైతే అదే బ్యాంకు) కు వెళ్లాలి. ఆ బ్యాంకులో అకౌంట్ ఉండనవసరం లేదు. అక్కడి క్యాషియర్ కి మీ చెక్కు, పట్టాదార్ పాస్ బుక్కు మొదటి పేజి, మీ ఆధార్ కార్డ్ జీరాక్స్ కాపీలు అందజేయాలి. చెక్కు వెనుక, జీరాక్స్ కాపీలలో మీరు సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను సరిపోల్చుకున్నక్యాషియర్, చెక్కుపై ఉన్న మొత్తానికి డబ్బులు అందజేస్తారు.అప్పుడు ఆ డబ్బును తీసుకొని వెళ్ళవచ్చు..