Banner
Banner

టమోటో, వంకాయ కలిసి కూర వండుకుంటూంటాం విని ఉంటారు. అయితే ఆ రెండు కాయగూరలు ఒకే మొక్కకు కాయటం మాత్రం విని ఉండరు. కానీ ఇది వింత కాదు నిజంగానే మీరూ కాయించవచ్చు మీ దొడ్లో అంటున్నారు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ విజిటేబుల్ రీసెర్చ్ వారు. ఉత్తరప్రదేశ్ వారణాసి కు చెందిన ఈ సంస్ద వారు ఒకే మొక్కకు రెండు కాయగూరలు కాసేలా టెక్నిక్ ని కనుగొన్నారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ సంస్ద ప్రిన్సపల్ సైంటిస్ట్ అనంత్ బహదూర్ మీడియాతో మాట్లాడారు.

“టమోటో,వంకాయ కలిపి పండే వంగడాన్ని అభివృధ్ది చేసాము. ఈ రెండు ఒకే ఫ్యామిలీకు చెందినవి అయినా వేర్వేరు క్యారక్టరిస్టిక్స్ ,లక్షణాలు కలిగి ఉంటాయి,” అన్నారు. బ్రొమిటో పిలవబడే ఈ మొక్క కొత్త వంగడాల అభివృద్ది విధానంలో మరో మైలు రాయి , చాలా కాలంగా మా సైంటిస్టులు చేస్తున్న కృషి ఫలించింది. ఇది పెద్ద విజయం అన్నారు. భారీ ఎత్తున ఈ బ్రొమటో సాగుబడి చేయచ్చు అన్నారు. విత్తనం వేసిన అరవై నుంచి డబ్బై రోజులు తర్వాత పంట ఇవ్వటం మొదలెడతాయి. ప్రతీ మొక్కా రెండు కేజీల టమోటో, రెండున్నర కేజీల వంకాయి ఇస్తాయి అన్నారు. త్వరలో మామూలు పరిస్దితుల్లో కూడా ఈ పంట వేయటానికి ఏమి చేయాలి,సామాన్య రైతుకు ఈ పంటను పండించే విధానలపై ఓ నిర్ణయానివచ్చి  తెలియచేస్తాము అన్నారు. ఇంతకు ముందే ఇదే సంస్దం పొమోటో అంటే టమోటో, బంగాళు దుంప కలిసి పండే మొక్కలను ఆవిష్కరించారు.

ఏటికి ఎదురీదుతూ సరికొత్త  ఆవిష్కరణలు చేసే ఫార్మర్ సైంటిస్ట్ ల అనుభవజ్ఞానాన్ని దేశంలోని రైతులందరికీ పంచిపెట్టడం ద్వారా దారిద్య్రాన్ని, ఆత్మహత్యలను రూపుమాపవచ్చు.  ఫార్మర్ సైంటిస్ట్ రూపొందించిన కొత్త టెక్నాలజీలను రైతులు దగ్గరకు తీసుకెల్లి వారికి అవగాహన కలిగించాలి. ఇలాంటి పరిశోధనలు మరిన్ని జరగాలి.

Banner
, , , , , , , , ,
Latest Posts from vyavasayam.com
banner